Vikkatakavi | నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వికటకవి’. ప్రదీప్ మద్దాలి దర్శకుడు. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ నెల 28న జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘ఇదొక అద్భుతమైన వెబ్‌సిరీస్. కంటెంట్ చూసి నిర్మాతగా గర్వపడుతున్నా. దర్శకుడు ప్రదీప్ పెద్ద స్థాయికి వెళ్తాడు. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సిరీస్ ఇది’ అని నిర్మాత రామ్ తాళ్లూరి అన్నారు.
ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న కంటెంట్ అనీ, అద్భుతమైన టీమ్ సెట్టవ్వడం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చిందనీ దర్శకుడు చెప్పారు. ఇంకా నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, బీవీఎస్ రవి, జీ5 కంటెంట్ హెడ్ సాయితేజ్, జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు, సంగీత దర్శకుడు అజయ్ అరసాడ, కెమెరామేన్ షోయబ్ కూడా
మాట్లాడారు.