Pawan Kalyan Birthday | టాలీవుడ్ స్టార్ హీరో, జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan Birthday) నేడు 52వ పడిలోకి అడుగుపెట్టాడు. ఆయన బర్త్‌డే సందర్భంగా అభిమానులు, జనసైనికులు, సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. మరోవైపు తన తమ్ముడు జన్మదినం సందర్భంగా పవన్‌కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్‌గా విషెస్ చెప్పాడు.
“ప్రియమైన కళ్యాణ్ బాబు.. జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, కల్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. దీంతో పాటు మెగ బ్రదర్స్ కలిసి దిగిన ఫొటోను జత చేశారు. కాగా ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
Happy Birthday… pic.twitter.com/pkry6DtwGA
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2023