Megastar Chiranjeevi | హైదరాబాద్లో శనివారం రాత్రి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ సభ్యుడు గంగుల కమలాకర్ కుమారుడి వివాహం ఘనంగా జరుగగా.. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. పెళ్లి వేడుకకు చేరుకున్న చిరంజీవికి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నూతన వధూవరులను కలిసి, వారికి పుష్పగుచ్ఛం అందించి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మెగాస్టార్ రాకతో వివాహ వేడుకలో ఒక్కసారిగా సందడి నెలకొంది, అతిథులందరూ ఆయనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఈ వేడుకలో చిరంజీవితో పాటు పలువురు రాజకీయ మరియు సినీ రంగ ప్రముఖులు కూడా పాల్గొని నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గంగుల కమలాకర్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే చిరంజీవి ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. వధూవరులతో కలిసి ఆయన దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Megastar @KChiruTweets garu attended the wedding of Gangula Kamalakar’s son last night and blessed the newlywed couple. ❤️ pic.twitter.com/xcoSPCpHo8
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 26, 2026