Nani Mets Chiru | నానీకి చిరు దంపతుల ప్రశంసలు..!
Nani Mets Chiru | శ్యామ్ సింగరాయ్ హీరో నానీని మెగస్టార్ చిరంజీవి దంపతులు మెచ్చుకున్నారు. ఎన్నో ప్రశంసలకు అర్హుడివని చిరు అన్నారు.

Nani Mets Chiru | శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన హీరో నానిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు మెచ్చుకున్నారు. ఇటీవలే ఈ సినిమాను వారు వీక్షించారు. ఈ నేపథ్యంలో నానీని చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. తన ఇంటికి వచ్చిన నానీకి పుష్పగుచ్చం అందించి అభినందించారు. నువ్వు దీనికంటే మరెన్నో ప్రశంసలకు అర్హుడివి అని నానీనుద్దేశించి చిరంజీవి అన్నారు. దీనికి ఆయనకు నానీ ధన్యవాదాలు తెలిపారు. చిరు దంపతులిద్దరూ నానీతో కొద్దిసేపు మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను శ్యామ్సింగరాయ్ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.
దాదాపు రెండేండ్ల తర్వాత హీరో నానీ.. శ్యామ్ సింగరాయ్తో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. బెంగాల్ నేపథ్యంతో కూడిన కథ ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. అందులో శ్యామ్ సింగరాయ్గా నానీ, ఆయన భార్యగా హీరోయిన్ సాయిపల్లవి నటించారు. ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

