Chiranjeevi – Venkatesh | టాలీవుడ్ సీనియర్ నటులు మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్‌లు ఒకే చోట కలుసుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా ప్రస్తుతం చిరు విశ్వంభరతో పాటు విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లు జరుగుతున్నాయి. అయితే చిరు రామోజీ ఫిలిం సిటీలో ఉన్న విషయం తెలుసుకున్న వెంకీ మామ విశ్వంభర సెట్స్‌కి వచ్చి సందడి చేశాడు. వెంకీతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, కథానాయికలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు చిరు మూవీ సెట్స్‌లో సందడి చేశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేశ్ స్టార్ అనిల్ రావిపూడి కాంబోలో ఈ మూవీ తెరకెక్కతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది.
Megastar @KChiruTweets and Victory @VenkyMama in a frame 🤩🌟
All smiles as team #VenkyAnil3 met #Chiranjeevi Garu on the sets today ❤️🔥#Vishwambhara@AnilRavipudi @DirVassishta @aishu_dil @Meenakshiioffl@SVC_official @UV_Creations pic.twitter.com/sHP9JyLrSY
— Ravanam Swami naidu (@swaminaidu_r) October 11, 2024