Megastar Chiranjeevi | టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత చిరంజీవి పేరు మార్చుకుని తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎదగడమే కాకుండా ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రికార్డు కూడా సృష్టించాడు. ఇప్పుడు బుక్ మై షో లాంటి ఆన్లైన్ టికెట్ వెబ్‌సైట్స్ ఉన్నాయి కానీ అప్పట్లో మెగాస్టార్ సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులతో పాటు సినీ లవర్స్ థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. ఇక చిరంజీవి వెండితెర పైకి రాకముందు రంగస్థలం మీదా నాటకాలు వేసిన విషయం తెలిసిందే. అయితే రంగస్థలం మీదా తాను వేసిన తొలి నాటకమే తనకు ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకువచ్చింది అంటూ 50 ఏండ్ల నాటి జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘రంగస్థలం’ మీద నా తొలి నాటకం ‘రాజీనామా‘. నర్సాపుర్‌లోని వైఎన్ఎమ్ కాలేజీలో ఈ నాటకం జరిగింది. కోన గోవింద రావు గారి రచనలో నా తొలి గుర్తింపు ఇది. ఈ నాటకంలో నటన వలన ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాను. నటుడు కావాలన్న కళ ఇక్కడినుంచే మొదలైంది. ఈ నాటకం జరిగి నేటికి 50 ఏండ్లు పూర్తి చేసుకుంది అంటూ చిరు రాసుకోచ్చాడు.
‘రాజీనామా’ .. Y N M College Narsapur లో ‘రంగస్థలం’ మీద తొలి నాటకం .. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు .. అది Best Actor కావటం .. ఎనలేని ప్రోత్సాహం .. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం .. ఎనలేని ఆనందం ! 🙏 pic.twitter.com/CfobnApui8
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 26, 2024