God Father Audio Rights | చిరు రీ ఎంట్రీ తర్వాత మంచి జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు పోటీనిస్తున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇటీవలే చిరు ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘గాడ్‌ఫాదర్’ ఒకటి. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ‘సరిగమ’ దక్కించుకుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, సత్యరాజ్ నటిస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ జూలై 4న సాయంత్రం 5.45 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై ఎన్.వీ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.
Elated to be associated with THE Mega 🌟 @KChiruTweets 's much-awaited #GodFather! 🔥🔥
An @MusicThaman musical! 🥁🎶#GodFatherOnSaregama @BeingSalmanKhan @jayam_mohanraja @SuperGoodFilms_ @AlwaysRamCharan #Nayanthara #RBChoudary @ProducerNVP @KonidelaPro pic.twitter.com/QOk8Tr5hDq
— Saregama South (@saregamasouth) July 3, 2022