Megastar Chiranjeevi | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన ‘బ్రహ్మా ఆనందం’ సినిమా వేడుకకు వెళ్లాడో కాని అప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతునే ఉన్నాడు. ఇప్పటికే తన వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న చిరు ఇదే వేడుకలో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో మరోసారి వైరల్ అవుతున్నాడు.
బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యాడు. అయితే ఈ వేడుకలో సుమ చిరంజీవికి మైక్ ఇచ్చి తన తాత గురించి మాట్లాడమని కోరుతుంది. దీంతో తన తాత పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు చిరు.
అమ్మగారి నాన్న, మా తాత రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లురు వాసి.. కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యాడు. మా అమ్మ తరచూ చెప్పేది.. నీకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్లేదు కానీ, మీ తాత బుద్ధులు రాకూడదు అని చెప్పుకోచ్చేది. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. నాకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్లు. వీరిద్దరి మీద అలిగితే ఇంకో ఆవిడా దగ్గరికి వెళ్లేవాడు అంతా ఆదర్శప్రాయుడు అంటూ ఆయన గురించి చెప్పుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
మా తాత మంచి రసికుడు.
:- MegaStar Chiranjeevi#BrahmaAnandam #BrahmaAnandamOnFeb14 #Chiranjeevi pic.twitter.com/oD01dr4O9d— Milagro Movies (@MilagroMovies) February 11, 2025