Bholaa shankar | అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ యువ హీరోలకు గట్టి పోటినిస్తున్నాడు. ఇప్పటికే ఈయన అరడజను సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించాడు. దీనితో పాటుగా మరో రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళాశంకర్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
మెగాస్టార్ ట్విట్టర్లో ‘వైబ్ ఆఫ్ భోళా’ అంటూ మోషన్ పోస్టర్ వీడియోను పోస్ట్ చేశాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘వేదాళం’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదివరకే చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తీసురేష్ నటిస్తుండగా తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఏ కే ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Happy #MahaSivaratri to All !🙏
Here goes the #VibeOfBHOLAA #BholaaShankarFirstLook #BholaaShankar 🔱@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @dudlyraj #MahathiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/XVxVYP5316
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 1, 2022