Mega156 | హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్’ . హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను ఒక సరికొత్త ఊహా ప్రపంచానికి తీసుకెళ్లిందీ సినిమా. పండోరా లోకం, అక్కడి మనుషులూ, ఆ వింత జీవులూ, వాటితో హీరో చేసే సాహసాలూ ప్రేక్షకలోకాన్ని ఆశ్చర్యపరిచాయి.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా ఇలాంటి ఓ అద్భుతలోకాన్ని సృష్టించబోతున్నారు.
చిరంజీవి – బింబిసార ఫేం వశిష్ట కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. జగదేక వీరుడు – అతిలోక సుందరి టైపు సోషియోఫాంటసీ కథ ఇది. ఈ సినిమా కోసం ఓ కొత్త లోకాన్ని క్రియేట్ చేస్తున్నారు. సాధారణంగా మన పురాణాల్లో పద్నాలుగు లోకాలు ఉంటాయని చెబుతారు. దర్శకుడు వశిష్ట మరో కొత్త లోకాన్ని చూపించబోతున్నాడు.
కథలో ఈ కొత్త లోకమే చాలా యునిక్ పాయింట్. విజువల్ ఎఫెక్ట్స్ చాలా ప్రాధన్యత వున్న సినిమా ఇది. ఇందుకోసం అగ్రశ్రేణి నిపుణులు పని చేయబోతున్నారు. యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ నిర్నిస్తోంది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.