Chiranjeevi | దక్షిణాదిన టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. దశాబ్ధ కాలానికి పైగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వస్తుంది. కాగా తాజాగా సమంత వయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. తరుచూ సోషల్ మీడియా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉండే సామ్, గత కొంత కాలంగా ఎలాంటి పోస్ట్‌లు చేయడం లేదు. దాంతో సమంత సర్జరీ చేయించుకుందని, చికిత్స కోసం యూఎస్ వెల్లిందని జోరుగా ప్రచారం జరిగింది. కాగా తాజాగా సమంత ఈ వార్తలపై స్పందిస్తూ తన వయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇప్పుడుప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపింది.
దీనిపై పలువురు సినీతారలు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే జూ. ఎన్టీఆర్, దుల్కర్ సల్మాన్, అఖిల్ వంటి పలువురు సెలబ్రెటీలు ట్వీట్లు చేయగా తాజాగా దీనిపై చిరంజీవి స్పందించాడు. ‘కాలానుగుణంగా జీవితాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. బహుశా మన స్వంత అంతర్గత శక్తి తెలుసుకోవడానికి ఇలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయి. నువ్వు ఒక అద్భుతమైన అమ్మాయివి, అంతర్గతంగా ఎంతో ధైర్యవంతురాలివి. నువ్వు ఈ సవాల్‌ను ఖచ్చితంగా అధిగమిస్తామని నేను నమ్ముతున్నాను. ధైర్యంగా, ధృడంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
Wishing you speedy recovery!!@Samanthaprabhu2 pic.twitter.com/ZWGUv767VD
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 30, 2022