Dacoit Movie | ‘డెకాయిట్’ మూవీపై రామ్ చరణ్ ప్రశంసల జల్లు.. అడివి శేష్ నటన అద్భుతమంటూ ట్వీట్!
RamCharan On Dacoit Movie | అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit) పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల జల్లు కురిపించారు.
RamCharan On Dacoit Movie | అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit) పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఆయన, సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకుంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. హరి పాత్రలో అడివి శేష్ అద్భుతమైన నటనను కనబరిచారని, ఆయన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చరణ్ కొనియాడారు. అలాగే మృణాల్ ఠాకూర్ తన నటనతో పాత్రకు ప్రాణం పోశారని, ఈ సినిమాలో ఆమె నటన ఎంతో లోతుగా ఉందంటూ మెచ్చుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పాటు ఇతర నటీనటులందరూ తమ ప్రదర్శనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, రాజీ పడకుండా నిర్మించిన తీరును చరణ్ ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతికంగా సినిమా ఎంతో రిచ్‌గా ఉందని, టీమ్ మొత్తం పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందని ఆయన తెలిపారు. రామ్ చరణ్ స్వయంగా సినిమాను మెచ్చుకుంటూ పోస్ట్ చేయడంతో ‘డెకాయిట్’ పై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్ ఖాతాలో ఈ చిత్రం మరో భారీ విజయంగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మెగా ప్రశంసలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Watched #Dacoit and thoroughly enjoyed it.@AdiviSesh delivers a solid and memorable performance as Hari. @mrunal0801 is terrific and brings great depth to her role.@anuragkashyap72 Garu and the entire cast stand out with strong performances.#SupriyaYarlagadda Garu &…
— Ram Charan (@AlwaysRamCharan) April 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

