Mega Family| చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు ఇప్పుడు టాప్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇక సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరించాలని ఎంతో కృషి చేస్తున్నారు. అయితే వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడం లేదు. అయితే ఓ మెగా హీరో రెండు ఏళ్లలో ఏకంగా 100 స్క్రిప్ట్‌లని రిజెక్ట్ చేశాడట. మరి ఆ హీరో మరెవరో కాదు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో మంచి హిట్ కొట్టిన వైష్ణవ్ ఆ తర్వాత ఏ సినిమాతోను మెప్పించలేకపోయాడు.
గత కొద్ది రోజులుగా వైష్ణవ్ తేజ్ సైలెంట్‌గా ఉంటున్నాడు. మరి అతనికి అవకాశాలు రావడం లేదా అంటే ఈ హీరో కోసం నిర్మాతలు వెయిట్ చేస్తూనే ఉన్నారు. పెద్ద నిర్మాతలు సైతం వైష్ణవ్ తేజ్‌తో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. కాని వైష్ణవ్ తేజ్ మాత్రం ఒక్క కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలేదట. కొంత మంది నిర్మాతలకు సినిమా చేస్తానని కమిట్ అయిన కథ నచ్చకపోవడంతో హోల్డ్‌లో పెడుతున్నాడట. అన్నపూర్ణ లాంటి పెద్ద బ్యానర్ లో కూడా వైష్ణవ్ తేజ్ సినిమా చేయాల్సి ఉంది. కాని ఎందుకో వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ఆసక్తి చూపడం లేదు.
వైష్ణవ్ తేజ్ గత రెండేళ్లలో ఏకంగా వంద కథల వరకు విన్నట్టు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అన్ని కథలు విన్నా కూడా వైష్ణవ్‌కి ఏ కథ నచ్చడం లేదా అని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’ , ఆది కేశవ’ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఇక 2023 చివర్లో ‘ఆదికేశవ’ రిలీజ్ కాగా, అది తేడా కొట్టింది. అందుకే తన తర్వాతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అర్ధమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.