Chiranjeevi – Anil ravipudi | అగ్ర కథానాయకుడు చిరంజీవి రీసెంట్గా కొత్త సినిమాను షురూ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు. మెగా157 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభంకాగా.. మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్‌కి సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం సిద్ధమవుతుండగా.. మే మూడో వారం నుంచి చిరంజీవి షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికోసం చిత్ర బృందం ప్రీ ప్రోడక్షన్ పనులను వేగవంతం చేసింది. కామెడీ ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరంజీవికి జోడీగా ఇద్దరూ హీరోయిన్లు నటించబోతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో చిరుతో పాటు విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు టాక్. చిరంజీవి ఈ చిత్రంలో తన రియల్ పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనుండగా.. భీమ్స్ సంగీతం అందించబోతున్నాడు.