కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటా: నటి

గత కొద్ది రోజులుగా తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. దళితులని ఇండస్ట్రీ నుండి తరిమేయాలని ఆమె కామెంట్ చేయడంతో మీరాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులతో పాటు.. ఏడు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విడుదలై చిరుతైగళ్ కట్చి పార్టీ ఉప కార్యదర్శి వన్నీయరసు మీరాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
మీరా అరెస్ట్ ఖాయమంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అది అసాధ్యం అని రాసుకొచ్చింది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని ఛాలెంజ్ చేసింది. తనను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుందని సంచలన కామెంట్లు చేసింది మీరా మిథున్.
కేరళలో తలదాచుకున్న ఆమెను నిన్న అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రాగా, ఆ సమయంలో మీరా మిథున్ చేసిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ ఆడవాళ్లకు రక్షణ లేదా? పోలీసులు చార్చర్ చేస్తున్నారు.. ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించండి’ అంటూ అరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందరు నన్ను టార్చర్ చేస్తున్నారు. నన్ను ముట్టుకుంటే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది మీరా. ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ..ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ వీడియోలో చెప్పడం గమనర్హం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- meera mithun
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

