ఒకప్పుడు తెలుగులో చక్కటి అందం, అభినయం కలబోతగా యువతరాన్ని ఆకట్టుకుంది మలయాళీ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్. భద్ర, గుడుంబాశంకర్ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. కొన్నేళ ్లక్రితమే వివాహం చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది మీరాజాస్మిన్. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో రీఎంట్రీ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్నది. ఈ సినిమాలో హీరో రామ్ అక్కయ్య పాత్రలో మీరాజాస్మిన్‌ను ఎంపిక చేశారని తెలిసింది. కథ నచ్చడంతో ఆమె ఈ సినిమాకు వెంటనే అంగీకరించిందని అంటున్నారు. బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘భద్ర’లో మీరాజాస్మిన్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.