స్టార్ స్టేటస్ వచ్చాక కూడా సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని తమ ఉనికిని మరింత చాటుకోవడం సినీ సెలబ్రిటీలకు పరిపాటైపోయింది. తాజాగా అందాలభామ మీనాక్షి చౌదరి లంగావోణీ ధరించి, తన వ్యక్తిగత సోషల్ మీడియాలో కొన్ని స్టిల్స్ విడుదల చేసింది. వీటికి ‘కొంచెం నాటీ.. కొంచెం స్వీట్’ అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ స్టిల్స్ సామాజిక మాధ్యమాల్లో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే.. ఇటీవల తన సంక్రాంతి విజయాల గురించి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ‘నా ఫస్ట్ సంక్రాంతి సినిమా ‘గుంటూరు కారం’ 2024 సంక్రాంతికి రిలీజైంది.
సూపర్‌స్టార్ మహేష్‌తో కలిసి నేను చేసిన సినిమా సంక్రాంతికి విడుదల కావడం అప్పట్లో చాలా ఆనందం అనిపించింది. ఇక 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో నా కెరీర్లో భారీ విజయాన్ని అందుకున్నా. ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’తో మరో వందకోట్ల విజయాన్ని అందుకున్నా. ఈ విధంగా సంక్రాంతి నా లైఫ్‌లోనే స్పెషల్ అయిపోయింది. ఇలాగే ప్రతి ఏడాదీ సంక్రాంతికి సినిమా ఉంటే చాలా బాగుంటుంది’ అని చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి.