Meenakshi Chaudhary | ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్‌తో జోష్ మీదున్నారు అందాలభామ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారమె. కాలేజీ రోజుల్లో తాను ఎదుర్కొన్న ఓ సమస్య గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు మీనాక్షి. ‘కాలేజీ రోజుల్లో చాలామంది నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. ప్రత్యేకంగా చూసేవారు. దాంతో నేను కూడా ఇతరులతో ఫ్రీగా ఉండలేకపోయేదాన్ని.
మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. దానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే.. ఆ రోజుల్లోనే నా ఎత్తు 6.2. దాంతో నా పక్కన నడిచేందుకు ఫ్రెండ్స్ ఇష్టపడేవారు కాదు. అబ్బాయిలైతే డిస్టెన్స్ మెయింటెన్ చేసేవాళ్లు. అప్పట్లో నా ఎత్తే నాకు అతిపెద్ద సమస్య. ఓ రోజు నాన్నకు నా సమస్యను వివరించా. ఆయన ఆర్మీ ఆఫీసర్. ఏదైనా నిర్మొహమాటంగా చెప్పేస్తారు.
‘నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో..’ అని సింపుల్‌గా సెలవిచ్చారు. అప్పటినుంచే నా గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టా. ఆ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొన్నా. నటిగా మారా. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడిదాకా వచ్చా.’ అంటూ చెప్పుకొచ్చారు మీనాక్షి చౌదరి.