Heroine | ఇటీవల వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికలుగా నటించి అలరించారు. ఈ సినిమాతో మీనాక్షికి మంచి పేరు వచ్చింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది.
ఇటీవల ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభం గురించి, తన బాల్యం గురించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది మీనాక్షి చౌదరి. చిన్నతనంలో ఇతరులతో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడేదానిని అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ కాలేజ్ రోజుల్లోనే నా ఎత్తు 6.2 ఉండేది. దాంతో చాలా మంది అమ్మాయిలతో పోల్చితే నేను చాలా ఎత్తుగా ఉండేదాన్ని. అందుకు నాకు చాలా మంది డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. అప్పటలో నా ఎత్తు నాకు సమస్యగా మారేది. చాలా బాధ కూడా అనిపించింది. ఇక ఆర్మీ ఆఫీసర్ అయిన మా నాన్నకు ఆ విషయం గురించి చెప్తే నీ సమస్యను నువ్వే పరిస్కరించుకోవాలని సూచించారు.
ఆ సమయంలో ఎక్కువగా బుక్స్‌ని స్నేహితుల మాదిరి చూశాను. బుక్స్ చదవడంతో పాటు అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఆటలపై కూడా ఆసక్తి కలిగింది. ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఆఫర్ సద్వినియోగం చేసుకున్నాను. సాధ్యం అయినంత వరకు కష్టపడి సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కారణంగానే నాకు ఖిలాడీ సినిమాలో నటించే అవకాశం దక్కింది. కనుక ఇండస్ట్రీలో ప్రతి చిన్న ఆఫర్ కూడా కచ్చితంగా ముందు ముందు కెరీర్ నిలదొక్కుకునేందుకు సహయపడుతుందని నేను భావిస్తున్నాం. సీనియర్ హీరోలతో నటించడానికి నాకు ఎలాంటి సమస్యలేదు. అది ఒక జోనర్‌గా భావిస్తాను అని మీనాక్షి పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.