Sundeep Kishan | సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మజాకా’. త్రినాధరావు నక్కిన దర్శకుడు. రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మాతలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘బ్యాచులర్స్ ఆంథమ్’ సూపర్‌హిట్ అయ్యిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రెండో పాటని విడుదల చేశారు.
‘బెడ్ లైటైనా లేనీ.. చీకటి లైఫ్ లోకీ.. ఫ్లడ్ లైటల్లే వచ్చావే… బేబీ నువ్వే..’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాయగా, లియోన్ జేమ్స్ స్వరపరిచారు. సందీప్‌కిషన్ ప్రేమకథను ప్రెజెంట్ చేసేలా ఈ పాట సాగింది. అలాగే.. రావురమేష్, అన్షు లవ్‌స్టోరీ కూడా ఈ పాటలో భాగమవ్వడం విశేషం. సందీప్‌కిషన్ ఈ పాటలో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. ఆయన డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రానికి రచన: ప్రసన్నకుమార్ బెజవాడ, కెమెరా: నిజార్ షఫీ, సహ నిర్మాత: బాలాజీ గుత్తా, నిర్మాణం: ఎకె ఎంటైర్టెన్మెంట్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్.