మౌర్య, తన్వీ జంటగా నటిస్తున్న ‘జోకర్’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గీత సి శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మీరా ప్రొడక్షన్స్ పతాకంపై సందీప్ రామినేని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌నివ్వగా, అల్లు స్నేహ కెమెరా స్విఛాన్ చేశారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిదని, ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని, త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సురేష్ రగుతు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నారు.