Actress Aishwarya Lekshmi | దక్షిణాదిలో బిజీయెస్ట్ నటిమణులలో ఐశ్వర్య లక్ష్మీ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం అని తేడా లేకుండా ప్రతీ భాషలో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ మలయాళ బ్యూటీ. గతేడాది అమ్ము, పొన్నియన్ సెల్వన్, మట్టి కుస్తి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ప్రేమలో పడినట్లు వెల్లడించింది. మాస్టర్, విక్రమ్ వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్‌దాస్‌తో ఐశ్వర్య ప్రేమలో ఉన్నట్లు తెలిపింది.
తాజాగా ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో అర్జున్‌దాస్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ లవ్ సింబల్‌ను జోడించింది. ఈ పోస్ట్‌పై హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సో హాపీ అంటూ కామెంట్ చేసింది. అయితే ఆ మధ్య ఐశ్వర్య ఓ ఇంటర్వూలో పెళ్లి ప్రశ్నలపై స్పందించి, తనకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని స్పష్టం చేసింది. అయితే అలా చెప్పిన కొన్ని రోజులకే ప్రేమను వ్యక్తపరచడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు నెటీజన్లు మాత్రం ఈ పోస్ట్‌పై స్పందిస్తూ కొత్త సినిమా ప్రమోషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరీ దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
అర్జున్ దాస్ బుట్టబొమ్మ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన కప్పెలా సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనీకా సురేందర్ హీరోయిన్గా నటిస్తుంది.