వరుణ్‌తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘మట్కా’. కరుణకుమార్ దర్శకుడు. డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. నవంబర్ 14న సినిమా విడుదల కానుంది. శనివారం విజయవాడలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. మట్కా కింగ్‌గా ఎదిగిన ఒక సాధారణ వ్యక్తి ప్రయాణమే ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందిందని, వరుణ్ని ఇప్పటివరకూ చూడని కొత్తకోణంలో చూస్తారని దర్శకుడు కరుణకుమార్ చెప్పారు. “గద్దలకొండ గణేష్’ తర్వాత అలాంటి సినిమాలు చేయాలని చాలామంది అడిగారు.
నానుంచి అలాంటి సినిమాలు ఆశించేవారికోసమే ఈ ‘మట్కా’. 1960 ప్రాంతంలో వైజాగ్‌లో జరిగే కథ ఇది. టీజర్లో కొన్ని చూశారు. ట్రైలర్లో ఇంకొన్ని చూస్తారు. నా కెరీర్లో గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా ‘మట్కా’ అవుతుంది’ అని వరుణ్‌తేజ్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంతకు ముందు ఓ లెక్క, ఈ సినిమా తర్వాత వరుణ్ కటౌట్ మరో లెక్క అన్న చందంగా సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ కిశోర్ కుమార్ కూడా మాట్లాడారు.