‘ఓ పెళ్లికి వైజాగ్ వెళ్లినప్పుడు అక్కడ ఊహించని విషయాలు తెలిశాయి. ఒకప్పుడు వైజాగ్‌లో నైట్ క్లబ్బులు, క్యాబరేతో పాటు మట్కా గేమ్ పాపులర్. వైజాగ్ వన్ టౌన్ గురించి, అక్కడి కల్చర్ గురించి తెలుసుకున్నప్పుడు మట్కా గేమ్‌పై ఆసక్తి పెరిగింది. అసలు ఈ గేమ్ ఎవరిది? అనే పరిశోధన మొదలుపెట్టా. కథకునిగా ‘వాడిపోయిన పువ్వులు’ అనే పేరుతో చిన్న కథ రాయాలనుకున్నా. కానీ రాస్తున్నప్పుడు ఇది సినిమా మెటీరియల్ అని అర్థమైంది.
అప్పడు ట్రీట్మెంట్ వెర్షన్ రాశా. అది ఫస్ట్ డ్రాప్ట్. రేపు మీరు చూసేది 12 డ్రాప్ట్.’ అని తెలిపారు దర్శకుడు కరుణకుమార్. ఆయన దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘మట్కా’. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు. డా.విజయేందర్‌రెడ్డి, రజనీ తాళ్లూరి హైబడ్జెట్లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణకుమార్ విలేకరులతో ముచ్చటించారు.
‘మట్కా పక్కా కమర్షియల్ సినిమా. నా ైస్టెల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌తో అందర్నీ అలరించేలా ఉంటుంది. వరుణ్‌తేజ్ అంటే 20ఏండ్ల తర్వాత కూడా ‘మట్కా’నే ప్రస్తావిస్తారు. పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చిన రతన్ ఖత్రి జీవితానికి దగ్గరగా ఇందులో హీరో పాత్ర ఉంటుంది.
79రోజుల్లో అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశా. సీన్ పేపర్ మీద ఉన్నప్పుడే దీనికి ఎలాంటి లైటింగ్ కావాలి.. ఎలాంటి లెన్స్ వాడాలో డిసైడ్ అయ్యాను. నిర్మాత సహకారం వల్లే ఈ సినిమాను డీటెయిల్‌గా తీయగలిగాను. జీవీ ప్రకాశ్ సంగీతం, కిశోర్‌కుమార్ ఛాయాగ్రహణం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.’ అని చెప్పారు కరుణకుమార్.