Matka Movie | మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 2019లో ఆయన నటించిన గద్దలకొండ గణేష్ తర్వాత వచ్చిన గని, F3, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాలలో ఒక్క సినిమా కూడా హిట్ కాలేదంటే హిట్ కోసం వరుణ్ ఎంత కరువులో ఉన్నాడో చెప్పుకోవచ్చు. అయితే వరుణ్ తేజ్ ఆశలన్నీ ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కా పైనే ఉన్నాయి. మట్కాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు ఈ మెగా హీరో.
పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఆగష్టు 11న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటనను ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. వైజాగ్ నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్లో వరుణ్ నాలుగు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. నవీన్ చంద్ర, కిశోర్, రవీంద్ర విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
From underdog to overlord,
He emerged as the King in his own territory 🂮Unveiling the First Look of Mega Prince @IamVaruntej from #Matka Tomorrow, AUGUST 11th @ 11:07 AM💥
A @KKfilmmaker Film@Meenakshiioffl #NoraFatehi @gvprakash @drteegala9 #RajaniTalluri @SRTMovies pic.twitter.com/WkQoHGjhBV
— Vyra Entertainments (@VyraEnts) August 10, 2024
Also read..