అభినవ్ గోమఠం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా’. తిరుపతి రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరీమ్ రెడ్డి, ప్రశాంత్ వి, భవాని కాసుల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘హలో అమ్మాయి..’ అనే తొలి గీతాన్ని ఆదివారం విడుదల చేశారు. సంజీవ్ స్వరపరచిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్ని అందించారు. సిధ్శ్రీరామ్ ఆలపించారు.
అందమైన ప్రేమ భావాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నామని, ఆద్యంతం చక్కటి వినోదంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని, ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ స్వయంభు, సంగీతం: సంజీవ్ టీ, సంభాషణలు: రాధామోహన్ గుంటి, స్క్రీన్ప్లే, దర్శకత్వం: తిరుపతి రావు.