NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలావుంటే ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి కీలక అప్డేట్ ఒకటికి బయటకు వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుండగా.. స్మశానంలో 2000 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. తారక్ కెరీర్లో మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.