NTR Neel | యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్‌లో ( ‘డ్రాగన్’ వర్కింగ్ టైటిల్) మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందిస్తూ.. తాను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు టోవినో థామస్.
తన తాజా మలయాళ చిత్రం ‘పళ్లిచట్టాంబి’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న టోవినో థామస్ ‘డ్రాగన్’ సినిమాలో తాను నటించడం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో నటించాలనే ఆశ తనకు బలంగా ఉన్నప్పటికీ, తాను ఒప్పుకున్న ఇతర సినిమాల వల్ల డేట్స్ కేటాయించడం సాధ్యపడలేదని ఆయన వివరించారు. ఈ కాల్షీట్ల సమస్య కారణంగానే ఇంతటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ‘డ్రాగన్’ చిత్రంలో టోవినో ఒక పవర్ఫుల్ విలన్ రోల్లో గానీ, లేదా హీరోకి సమానమైన ఒక బలమైన పాత్రలో గానీ కనిపిస్తారని అంతా భావించారు.
ప్రశాంత్ నీల్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టోవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, ఆయన కోసం అనుకున్న ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మరోకరిని ప్రశాంత్ నీల్ తీసుకున్నట్లు సమాచారం.