Pushpa 2 The Rule Mass Song | ”దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయిరో.. కిస్ కిస్ కిస్ కిస్సిక్.. కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.. దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో.. దెబ దెబ దెబ్బలు పడతయి రో” అంటూ పుష్ప 2 సాంగ్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలు అన్ని ఊగిపోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2: ది రూల్’ (Pushpa2). ఈ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌తో పాటు కిస్సిక్ సాంగ్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.
అయితే ఈ హైప్‌ని మరింత పెంచుతూ.. మూవీ నుంచి మరో మాస్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ హింట్ కూడా ఇవ్వగా.. నేడు కేరళలో జరిగే పుష్ప ఈవెంట్లో ఈ పాటకు సంబంధించి అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 30 నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది.