రవితేజ కిక్ సినిమాకు 12 ఏళ్లు
రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చిన తర్వాతే మాస్ రాజా మార్కెట్ పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 12 ఏళ్లవుతుంది.

రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చిన తర్వాతే మాస్ రాజా మార్కెట్ పెరిగిపోయింది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 12 ఏళ్లవుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రవితేజ కెరీర్ లో మాస్టర్ పీస్ గా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ కిక్ చిత్రాన్ని నిర్మించారు. 2009 మే 8న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ‘#12YearsForKick’ ‘#12YearsOfKICKMadness’ హ్యాష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కిక్ అప్పట్లో వసూలు చేసిన మొత్తం ఇప్పుడు చూద్దాం..
నైజాం-7.53 కోట్లు
సీడెడ్-2.72 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.12 కోట్లు
ఈస్ట్- 0.94 కోట్లు
వెస్ట్- 0.92 కోట్లు
గుంటూరు- 1.7 కోట్లు
కృష్ణా- 1.03 కోట్లు
నెల్లూరు- 0.84 కోట్లు
ఏపీ + తెలంగాణ మొత్తం- 18.89 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 3.86 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్- 22.75 కోట్లు
కిక్ సినిమాను అప్పట్లో రవితేజ మార్కెట్ రేంజ్‌కు తగ్గట్లుగానే రూ.13.77 కోట్లకు అమ్మారు. అంటే 15 కోట్లు వస్తే సేఫ్ అన్నమాట. అలాంటి సమయంలో ఈ సినిమా 12 ఏళ్ల కిందే 22.75 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే బయ్యర్లకు 8.95 కోట్ల లాభాలు తీసుకొచ్చిందన్నమాట. ఆ ఏడాది విడుదలైన సినిమాల్లో మగధీర, అరుంధతి తర్వాత అత్యధిక లాభాలను మిగిల్చిన సినిమా ఇదే. రవితేజ మార్కెట్ ను ఒకేసారి రెండింతలు పెంచేసింది కిక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
నెటిజన్ కామెంట్..హేమ రిప్లై ఇదే..!
సురక్షితంగా ఉండండి.. సంక్షోభం నుండి బయటపడుతాం : మహేశ్‌బాబు
కరోనా ఎఫెక్ట్.. తండ్రికి క్షవరం చేసినబండ్ల గణేష్
కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్
ప్రభాస్ పెళ్లి ఇప్పట్లో లేనట్టేనా ..!
అంత చేసినా చివరికి యువతిని కాపాడలేకపోయానంటూ సోనూసూద్ భావోద్వేగం
కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

