Mass Jathara First Single | మాస్ మహరాజా రవితేజ హిట్టు కొట్టి చాలా కాలమవుతుంది. అప్పుడెప్పుడో ధమాకాతో హిట్టు అందుకున్న ఈ మాస్ హీరో ఆ తర్వాత మళ్లీ విజయం చూడలేదు. గతేడాది వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు పరాజయం అందుకున్నాయి. దీంతో ఎలాగైన హిట్టు కొట్టాలనే కసి మీదా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). ‘మనదే ఇదంతా’ ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 9న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
తు మేర లవర్(TuMeraLover) అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ క్లాసిక్ పాటలలో ఒకటైన ఇడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇక టైటిల్‌కు తగినట్లుగానే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు.
This one’s going to be a massiest feast for everyone who’s been waiting 🙂 🫶🏻#TuMeraLover on April 14th. 💃#MassJathara@RaviTeja_offl @BheemsCeciroleo @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya @vidhu_ayyanna @NavinNooli @nandusavirigana @phanikvarma @SitharaEnts… pic.twitter.com/LrUHLVAQrR
— Sreeleela (@sreeleela14) April 10, 2025