సందేశంతో ‘మరో ప్రస్థానం’

తనీష్, ముస్కాన్‌సేథీ జంటగా నటిస్తున్న చిత్రం ‘మరో ప్రస్థానం’. జాని దర్శకుడు. ఉదయ్‌కిరణ్ నిర్మాత. ఈ నెల 24న విడుదలకానుంది. తనీష్ మాట్లాడుతూ ‘నటుడిగా నన్ను మరో మెట్టుఎక్కించే చిత్రమవుతుంది. సమాజంలో జరుగుతున్న వాస్తవ ఘటనల్ని, సమకాలీన సమస్యల్ని ఇందులో చర్చించాం. ప్రతి మనిషిలో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘డెత్ స్ట్రింగ్ ఆపరేషన్ ఆధారంగా సాగే సినిమా ఇది. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి. కొత్త తరహా ప్రయోగంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని చెప్పారు. ‘అతి తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. వర్తమాన అంశాలపై రూపొందించిన శక్తివంతమైన సినిమాగా ఆకట్టుకుంటుంది’ అని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర సవాలుతో సాగుతుందని కథానాయిక ముస్కాన్‌సేథీ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్‌రెడ్డి, మాటలు: వసంత కిరణ్, యానాల శివ, సంగీతం: సునీల్‌కశ్యప్, రచన-దర్శకత్వం: జాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

