యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్ (Vikram) ఖైదీ ఫేం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్టు ఈ జూన్ 3న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజు నుంచి కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే ఫార్ములాను అప్లై చేస్తూ వస్తోంది.
కాగా విక్రమ్ తెలుగు వెర్షన్ ను టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. విక్రమ్ మంచి కాసుల వర్షం కురిపిస్తుండటంతో శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ (Vikram success meet) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల పంట పండిస్తోన్న సంగతి తెలిసిందే. ఖైదీ సినిమా చూసిన తర్వాత లోకేశ్ కనగరాజ్‌కు సినిమా చేసే అవకాశం ఇచ్చినట్టు చెప్పారు.
విక్రమ్ మంచి సినిమా అవుతుందని నమ్మాను..కానీ లోకేశ్ ఈ చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ హిట్ చేశాడని చెప్పుకొచ్చారు. సక్సెస్మీట్కు తెలుగులో తనకు మరో చరిత్ర సినిమా స్టార్ స్టేటస్‌ను అందించిందని కమల్ హాసన్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ చెన్నైలో ఎలాంటి సబ్ టైటిల్స్ లేకుండా చెన్నైలో రెండున్నరేళ్లపాటు స్క్రీనింగ్ అయిందని చెప్పారు.
సినిమాకు భాష లేదని, సినిమా భాష ప్రపంచ భాష అని అన్నారు కమల్ హాసన్. చీఫ్ గెస్టుగా హాజరైన రానా మంచి సినిమాలు చేస్తూ..మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన అప్ కమింగ్ సినిమాలు కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు కమల్.