Varanasi The Movie | సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న పాన్-వరల్డ్ మూవీ ‘వారణాసి’ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని రాజమౌళి ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 07 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపాడు. ఉగాది, గుడి పడ్వా వంటి పండుగలతో పాటు అంబేద్కర్ జయంతి, శ్రీరామనవమి వంటి వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు.
పురాణాల నేపథ్యంతో కూడిన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. అంతేకాకుండా, భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఈ చిత్రాన్ని 1.43:1 IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండటం విశేషం. రాజమౌళి మార్క్ ప్రమోషన్లు ఇప్పటి నుంచే మొదలవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను సృష్టిస్తుందోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Varanasi Movie Release Date