Pawan Kalyan son accident | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సింగపూర్‌లోని స్కూల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చిన్నారి మార్క్ కాళ్లు, చేతులకు గాయాలు కాగా, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. ప్రస్తుతం అతడు సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు సింగపూర్‌కి బయలుదేరి వెళ్లగా.. పవన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా మార్క్‌ని చూడడానికి వెళ్లారు.
అయితే తాజాగా మార్క్ శంకర్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు ఫొటోను విడుదల చేశారు కుటుంబసభ్యులు. ఈ ఫొటోలో మార్క్ విజయానికి సంకేతం చూపిస్తున్నట్లుగా పోజ్ ఇచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరోవైపు మార్క్ పూర్తిగా కోలుకోవడానికి మూడు రోజులు పట్టనున్నట్లు సమాచారం.
#MarkShankar picture from yesterday’s unfortunate incident. Thankfully, he is on the road to recovery. Wishing him a speedy healing journey ❤️ pic.twitter.com/XiYOVPWHcT
— Telugu Chitraalu (@TeluguChitraalu) April 9, 2025