కోలీవుడ్ యాక్టర్ విశాల్ (Vishal ) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి మార్క్ ఆంటోని (Mark Antony). యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అధిక్రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ కమ్యాక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆగస్టు 29న విశాల్ బర్త్ డే సందర్భంగా మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
మార్క్ ఆంటోనీ చిత్రంలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్నిమినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విడుదల తేదీపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. మరోవైపు విశాల్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ లాఠి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉంది.
దీంతోపాటు విశాల్ స్వీయదర్శకత్వంలో తుప్పరివాలన్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ డిటెక్టివ్ ఫిల్మ్‌ను హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై స్వయంగా విశాల్ నిర్మిస్తుండటం విశేషం.
#MarkAntony First Look on Mark Antony’s Birthday🧨💣💥@VishalKOfficial @iam_SJSuryah @vinod_offl @gvprakash @riturv
💥see you tomorrow at 11:11 am🤝 pic.twitter.com/w8W28wjRFZ
— Vishal Film Factory (@VffVishal) August 28, 2022