బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన రియల్ కపుల్.. ఇంతకీ ఈ జంట ఎవరు?
Marina and Rohit in Bigg Boss season 6 | బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒక కలర్‌ఫుల్ కపుల్ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ నటులుగా పాపులర్ అయిన రియల్ కపుల్ మెరీనా రోహిత్ జంట బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. పది, 11వ కంటెస్టెంట్స్‌గా ఈ జంట హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ సందేశ్, వితికా షెరూ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఒక రియల్ కపుల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడంతో ఈ సీజన్ ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ కపుల్ గురించి ఒకసారి తెలుసుకుందాం.
మెరీనా అబ్రహం గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. జీ తెలుగులో ప్రసారమైన అమెరికా అమ్మాయి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అందులో సమంతా కళ్యాణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఉయ్యాల జంపాలా సీరియల్లోనూ నటించింది. 2016లో రొమాన్స్ విత్ ఫైనాన్స్ అనే సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. అనంతరం సబ్ కా దిల్ ఖుష్ అనే హిందీ చిత్రంలోనూ నటించింది. రోహిత్ సహానీ కూడా పలు సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. నీలికలువలు, అభిలాష అనే సీరియల్స్‌లో నటించాడు. 2015లో చిరు గొడవలు అనే సినిమాలో కూడా నటించాడు. ఇక రోహిత్, మెరీనా ఇద్దరూ ఒక డ్యాన్స్ రియాల్టీ షోలో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో 2017లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Read More :
Bigg Boss 6 Telugu Live Updates | బిగ్‌బాస్ 6 తెలుగు లైవ్ అప్డేట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

