Bigg Boss 6 Telugu First Contestant Keerthi Bhat | తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 6 ప్రారంభమైంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ సీజన్లో తొలి కంటెస్టెంట్‌గా కీర్తి కేశవ్ భట్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కీర్తి భట్ గురించి కొన్ని విషయాలు..
కర్ణాటకలోని బెంగళూరులో కీర్తి భట్ జన్మించింది. చిన్నతనం నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండటంతో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. డ్యాన్స్ కూడా నేర్చుకుంది. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి కాగానే కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ వరుసపెట్టి మూడు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సనిమాల్లోనూ నటించింది. తెలుగులో మనసిచ్చి చూడు సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సీరియల్లో భాను అనే పాత్రలో అద్భుతంగా నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో హిమ పాత్రలో నటిస్తోంది. ఆరేండ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది కీర్తి భట్. ఆ తర్వాత తనూ భట్ అనే ఓ చిన్నారిని దత్తత తీసుకుంది.
Bigg Boss 6 Telugu Live Updates | బిగ్‌బాస్ 6 తెలుగు లైవ్ అప్డేట్స్