Bigg Boss 6 Telugu Live Updates | బిగ్‌బాస్ 6 తెలుగు లైవ్ అప్డేట్స్
Bigg Boss 6 Telugu Live Updates | బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ మరో సీజన్ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో ఆరో సీజన్ మొదలైంది.
Bigg Boss 6 Telugu Live Updates | బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ మరో సీజన్ ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాగార్జున గ్రాండ్ ఎంట్రీతో ఆరో సీజన్ మొదలైంది.
-
04 Sep 2022 09:25 PM (IST)
21వ కంటెస్టెంట్‌గా రేవంత్
21వ కంటెస్టెంట్‌గా సింగర్ రేవంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సింగర్‌గా టాలీవుడ్లో రేవంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన 200కి పైగా పాటలు పాడాడు. ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకుని జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

-
04 Sep 2022 09:20 PM (IST)
20వ కంటెస్టెంట్‌గా ఆరోహి
20వ కంటెస్టెంట్‌గా ఆరోహి రావు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. టీవీ 9లో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ న్యూస్‌తో గుర్తింపు తెచ్చుకుంది ఆరోహి రావు అలియాస్ అంజలి. అంతకుముందు పలు షార్ట్ఫిలింస్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.

-
04 Sep 2022 09:13 PM (IST)
19వ కంటెస్టెంట్‌గా రాజశేఖర్
19వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రాజశేఖర్. 19వ కంటెస్టెంట్‌గా నటుడు రాజశేఖర్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్ కల్యాణ వైభోగం, మనసు మమత సీరియల్స్‌లో నటించాడు. అలాగే అడవి శేష్ నటించిన మేజర్ సినిమాలోనూ చిన్న పాత్ర చేశాడు. బిగ్‌బాస్ 5 విన్నర్ సన్నీకి రాజశేఖర్ క్లోజ్ ఫ్రెండ్.

-
04 Sep 2022 09:07 PM (IST)
18వ కంటెస్టెంట్‌గా ఆదిరెడ్డి
బిగ్‌బాస్ హౌస్‌లోకి 18వ కంటెస్టెంట్‌గా ఆదిరెడ్డి ఎంట్రీ ఇచ్చాడు.
కామన్ మ్యాన్ కేటగిరీలో 18వ కంటెస్టెంట్‌గా ఆదిరెడ్డి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వరికుంటపాడు. బిగ్‌బాస్ సీజన్ 2 సమయంలో ఫ్రెండ్ సలహాతో షోపై రివ్యూ ఇచ్చి సోషల్‌మీడియాలో అప్లోడ్ చేశాడు ఆదిరెడ్డి. ఆ వీడియో పాపులర్ కావడంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రివ్యూలు ఇచ్చాడు. అలా బిగ్‌బాస్ షోలకు రివ్యూలు ఇస్తూ.. ఇప్పుడు అదే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆదిరెడ్డి.
-
04 Sep 2022 08:54 PM (IST)
17వ కంటెస్టెంట్‌గా ఫైమా
17వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా ఎంట్రీ ఇచ్చింది. పటాస్ షోతో గుర్తింపు పొందిన ఫైమా అనతికాలంలోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. పటాస్ అయిపోయిన తర్వాత జబర్దస్త్ కామెడీ షోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనదైన ఆటిట్యూడ్, కామెడీ పంచులతో బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్‌గా మారింది.

-
04 Sep 2022 08:49 PM (IST)
16వ కంటెస్టెంట్‌గా టీవీ 9 యాంకర్
ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా టీవీ 9 నుంచి ఓ యాంకర్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. 16వ కంటెస్టెంట్‌గా ఆర్జే సూర్య ఎంట్రీ ఇచ్చాడు. ఆర్జే సూర్య పూర్తి పేరు సుంకర సూర్యనారాయణ. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సూర్య మిమిక్రీ ఆర్టిస్టుగా పలు షోలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. గరుడ వేగ, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు.

-
04 Sep 2022 08:47 PM (IST)
15వ కంటెస్టెంట్‌గా ఇనయా సుల్తానా
15వ కంటెస్టెంట్‌గా ఇనయా సుల్తానా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది ఇనయా సుల్తానా. తాజాగా బుజ్జీ ఇలారా సినిమాలో నటించింది.

-
04 Sep 2022 08:27 PM (IST)
14వ కంటెస్టెంట్‌గా షానీ సల్మాన్
14వ కంటెస్టెంట్‌గా షానీ సల్మాన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల షానీ స్వస్థలం. అథ్లెటిక్ నేషనల్ ఛాంపియన్ అయిన షానీ పలు సినిమాల్లోనూ నటించాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవికాకుండా దేవదాస్, హ్యాపీ, రెడీ, ఒక్క మగాడు, శశిరేఖా పరిణయం, కిన్నెరసాని తదితర చిత్రాల్లో నటించాడు. చివరగా 2021లో వచ్చిన రామ్ అసుర్‌లో శివన్నగా మెప్పించాడు.

-
04 Sep 2022 08:19 PM (IST)
13వ కంటెస్టెంట్‌గా వాసంతి కృష్ణన్
బిగ్‌బాస్ హౌస్‌లోకి 13 వ కంటెస్టెంట్‌గా వాసంతి కృష్ణన్ అడుగుపెట్టింది. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వాసంతి.. సిరిసిరి మువ్వలు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సంపూర్ణేశ్‌బాబు నటించిన క్యాలీఫ్లవర్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన వాంటెడ్ పండుగాడ్ సినిమాలోనూ కీలక పాత్రలో నటించింది. అంతకుముందు పలు కన్నడ సినిమాల్లోనూ నటించింది వాసంతి.

-
04 Sep 2022 08:16 PM (IST)
12వ కంటెస్టెంట్‌గా బాలాదిత్య
బిగ్‌బాస్ హౌస్‌లోకి 12 వ కంటెస్టెంట్‌గా బాలాదిత్య ఎంట్రీ ఇచ్చాడు. బాలాదిత్య తొమ్మిదేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్లాం సినిమాతో సినిమాల్లోకి వచ్చిన బాలాదిత్య దాదాపు 24 సినిమాల్లోనటించాడు. 2003లో చంటిగాడు సినిమాతో హీరోగా మారిన బాలాదిత్య.. పలు సినిమాల్లో నటించాడు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో వెండితెరకు దూరమై.. బుల్లితెరపై సీరియల్స్‌లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు.

-
04 Sep 2022 08:01 PM (IST)
బిగ్‌బాస్ హౌస్‌లోకి రియల్ కపుల్
బిగ్‌బాస్ హౌస్‌లోకి రియల్ కపుల్ ఎంట్రీ ఇచ్చింది. మెరీనా, రోహిత్ జంట వరుసగా పది, 11వ కంటెస్టెంట్స్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు.

-
04 Sep 2022 07:50 PM (IST)
తొమ్మిదో కంటెస్టెంట్‌గా అభినయశ్రీ
అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం అంటూ ఆర్య సినిమాలోని ఐటెంసాంగ్‌తో ఫేమస్ అయింది అభినయ శ్రీ. ఆ తర్వాత పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడింది. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న అభినయశ్రీ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది.

-
04 Sep 2022 07:44 PM (IST)
ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ అడుగుపెట్టింది. జబర్దస్త్ చూసేవారికి గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన కామెడీతో బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న గీతూ.. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

-
04 Sep 2022 07:37 PM (IST)
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగులో పాట పాడిన ఆలియాభట్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో బాలీవుడ్ కపుల్ ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ సందడి చేశాడు. గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు తెలుగులో నమస్కారం చెప్పి ఆకట్టుకున్నారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను చూడాలని కోరారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ తెలుగులో మాట్లాడగా.. ఆలియాభట్ ఏకంగా పాటనే పాడింది.
ఇక ఈ ఈవెంట్లోనే బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ప్రోమోను విడుదల చేశారు. బిగ్‌బాస్ స్టేజిపై తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించిన రణ్‌బీర్.. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 విడుదల సమయానికి తెలుగు పూర్తిగా నేర్చుకుంటానని చెప్పుకొచ్చాడు. అప్పుడు నాగార్జున అందుకుని ఆ సినిమాకు తెలుగు వర్షన్ సొంతంగా డబ్బింగ్ చెప్పాలని కోరాడు.
-
04 Sep 2022 07:26 PM (IST)
ఏడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కళ్యాణ్
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఏడో కంటెస్టెంట్‌గా అర్జున్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఏపీలోని కొవ్వూరుకు చెందిన అర్జున్ అమెరికాలోని కెంటకీ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశాడు. అనంతరం పలు షార్ట్ ఫిలింస్‌లో నటించాడు. 2013లో చిన్న సినిమా అనే చిత్రంతో హీరోగా మారాడు. ప్లే బ్యాక్, పెళ్లి కూతురి పార్టీ వంటి సినిమాల్లోనూ అర్జున్ నటించాడు.

-
04 Sep 2022 07:15 PM (IST)
ఆరో కంటెస్టెంట్‌గా త్రినయిని సీరియల్ నటి
ఆరో సీజన్లో ఆరో కంటెస్టెంట్‌గా త్రినయిని సీరియల్ నటి శ్రీ సత్య అడుగుపెట్టింది. నటి శ్రీ సత్య అసలు పేరు మంగళంపల్లి శ్రీసత్య. 2015లో మిస్ విజయవాడ టైటిల్ గెలుచుకుంది. నేను శైలజ సినిమాలో హీరో రామ్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో నటించింది. ఆ తర్వాత బుల్లి తెరపై సెటిల్ అయింది. ముద్దమందారం, త్రినయని, నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కాచెల్లెల్లు వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

-
04 Sep 2022 07:07 PM (IST)
ఐదో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ కమెడియన్
జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరో కంటెస్టెంట్‌గా ఆయన హౌస్‌లోకి అడుగుపెట్టాడు.

-
04 Sep 2022 06:43 PM (IST)
ఐటెం సాంగ్‌తో ఐపీఎల్ యాంకర్ ఎంట్రీ
నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ నేహా చౌదరి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకున్న నేహా చౌదరి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

-
04 Sep 2022 06:38 PM (IST)
మూడో కంటెస్టెంట్‌గా సిరి బాయ్‌ఫ్రెండ్
మూడో కంటెస్టెంట్‌గా సిరి హన్మంత్ బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి బిగ్‌బాస్ ఓటీటీ మొదటి సీజన్లోనే శ్రీహాన్ కంటెస్టెంట్‌గా రాబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు కుదరకపోయినా.. ఇప్పుడు ఈ సీజన్‌తో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీహాన్.

-
04 Sep 2022 06:32 PM (IST)
రెండో కంటెస్టెంట్‌గా సుదీప
బిగ్‌బాస్ హౌస్‌లోకి రెండో కంటెస్టెంట్‌గా సుదీప గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రతో పాపులర్ అయిన సుదీప.. చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేసింది.

-
04 Sep 2022 06:15 PM (IST)
మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి భట్
బిగ్‌బాస్ హౌస్‌లోకి మొదటి కంటెస్టెంట్‌గా కార్తీక దీపం ఫేమ్ కీర్తి భట్ అడుగుపెట్టింది. కార్తీక దీపం కంటే ముందు మనసిచ్చి చూడు సీరియల్‌తో కీర్తి గుర్తింపు తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

