Bigg Boss 6 Telugu | బిగ్బాస్ తెలుగు సీజన్ 6లో బాలీవుడ్ కపుల్ ఆలియాభట్, రణ్బీర్ కపూర్ సందడి చేశాడు. గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్కు వచ్చిన ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు తెలుగులో నమస్కారం చెప్పి ఆకట్టుకున్నారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను చూడాలని కోరారు. ఈ సందర్భంగా రణ్బీర్ తెలుగులో మాట్లాడగా.. ఆలియాభట్ ఏకంగా పాటనే పాడింది.
ఇక ఈ ఈవెంట్లోనే బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ప్రోమోను విడుదల చేశారు. బిగ్బాస్ స్టేజిపై తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించిన రణ్బీర్.. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 విడుదల సమయానికి తెలుగు పూర్తిగా నేర్చుకుంటానని చెప్పుకొచ్చాడు. అప్పుడు నాగార్జున అందుకుని ఆ సినిమాకు తెలుగు వర్షన్ సొంతంగా డబ్బింగ్ చెప్పాలని కోరాడు.