Manchu Manoj | మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఈ మధ్య సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాడు. మనోజ్ సోలో హీరోగా రూపొందిన సినిమా థియేటర్స్‌లోకి వచ్చి చాలా రోజులే అవుతుంది. తను నటించిన ‘భైౖరవం’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘మిరాయ్’లో విలన్‌గా కనిపించబోతున్నారు. ఇవి కాకుండా హీరోగా ఓ రెండు సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించాడు. కాని అవి మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఇప్పుడు మరో కొత్త సినిమా శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు మంచు మనోజ్. 90 ఎం.ఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘అత్తరు సాయిబు’ అనే టైటిల్ తో మనోజ్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.
’90 ఎంఎల్’ సినిమా తర్వాత శేఖర్ రెడ్డి ఈ కథ మీద వర్క్ చేయగా,ఈ మూవీని మంచు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా మే 20వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ పూజ కార్యక్రమాలు జరగకపోతే ఆరోజు సినిమాను అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. టైటిల్ వినగానే ఇది ఏ తరహా సినిమానో మనకు అర్ధం అవుతుంది. ఈ చిత్రం. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ తో సాగే కథ అని అర్ధమవుతుంది. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో బయటకు వస్తాయి. కాగా, మంచు మనోజ్ ‘వాట్ ద ఫిష్’, ‘అహం బ్రహ్మస్మి’ సినిమాలు ఇది వరకే మొదలెట్టాడు. అయితే ఇవి ఎంత వరకూ వచ్చాయో క్లారిటీ లేదు.
ఇక భైరవం చిత్రంతో త్వరలో పలకరించనుండగా, ఇందులో మనోజ్‌తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. మినీ మల్టీస్టారర్ సినిమా గా ఈ చిత్రం రూపొందింది. ‘కన్నప్ప’కు పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది మనోజ్ ప్లాన్. ఇది వరకు ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే అదే రోజున భైరవం’ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘కన్నప్ప’ వాయిదా పడడంతో ‘భైరవం’ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక ఇదిలా ఉంటే మంచు కుటుంబంలో కలహాలు కొన్ని రోజుల క్రితం ఎంత హాట్ టాపిక్ అయ్యాయో మనం చూశాం.. ఇవి ఓ కొలిక్కి వచ్చాయో లేదా అనే దానిపై క్లారిటీ లేదు.