బాలీవుడ్లో ఆంఖే, వక్త్, నమస్తే లండన్ వంటి హిట్ చిత్రాలను రూపొందించిన దర్శకనిర్మాత విపుల్‌షా తాజాగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘గవర్నర్’ పేరుతో తెరకెక్కించనున్న ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పాయ్ టైటిల్ రోల్‌ని పోషించనున్నారు.
చిన్మయి మండేల్కర్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. సమకాలీన భారతీయ రాజకీయ వ్యవస్థను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, గత రెండేళ్లుగా ఈ సినిమా కంటెంట్ కోసం రీసెర్చ్ చేశామని విపుల్‌షా తెలిపారు. జూలైలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.