అనుమతి లేకుండా తన పాటల్ని ఎవరైనా వాడుకుంటే వాళ్లపై లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నారు లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. రీసెంట్గా ‘మంజుమల్ బాయ్స్’ నిర్మాతలకు ఆయన లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ‘గుణ’ సినిమాలో తాను ట్యూన్ చేసిన ‘కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే..’ పాటను తన అనుమతి లేకుండా వాడుకున్నారనీ, కాపీరైట్స్ యాక్ట్ ప్రకారం ఇది నేరమని, దీనిపై రెండుకోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఇళయరాజా డిమాండ్ చేశారు.
లీగల్ నోటీసులు అందుకున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీలు ఇళయరాజాను వ్యక్తిగతంగా కలిసి, చర్చలు నిర్వహించి, చివరకు 60 లక్షలకు మేటర్ సెటిల్ సెటిల్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇళయరాజా ఇలా ప్రవర్తించడంపై పలు విమర్శలు కూడా తలెత్తుతున్నాయి.