Manisharma Emotional | ఒకప్పటి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సంగీతంతో ఎందరో టాలీవుడ్ హీరోలను స్టార్లుగా చేశాడు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించాడు. అలాంటి ఆయన ఇప్పుడు తనకు ఆఫర్స్ రావడం లేదని బాధని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
రీసెంట్గా మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ప్రస్తుతం ఏ విషయంలోనైనా మీరు హర్ట్ అవుతున్నారా? అని యాంకర్ అడుగుతాడు. దీనికి సమాధానమిచ్చిన ఇచ్చిన మణిశర్మ.. ‘హర్ట్ అయ్యేందుకు కారణం ఏదైనా ఉందంటే.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఒక్కో ఛాన్స్ ఇవ్వొచ్చు. అలా అన్ని నాకే ఇవ్వమని నేను అడగటం లేదు. దేవిశ్రీ, థమన్ లాంటి వాళ్ళకి రెండు సినిమాలు ఇచ్చి.. నా లాంటి వాళ్ళకి ఒక సినిమా అయినా ఇస్తే బాగుంటుంది. అప్పుడు ఆడియన్స్ కి కూడా కొత్త మ్యూజిక్ విన్నట్లు ఉంటుంది అంటూ మణిశర్మ మనసులోని బాధని చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Emotional chesesaav my music God 🥺
OG, UBS, HHVM veeti tarvata oche next movie edhi ayithe daaniki mana manisharma ni petteyamani cheppu poweruu @PawanKalyan 🙁
Okappati mee combo antene 🤌pic.twitter.com/GqLHr5MoFE— Sairam Kalyan (@SairaamKalyan) January 3, 2024