ManiRatnam – Naveen Polishetty | టాలీవుడ్ యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి బంపరాఫర్ కొట్టినట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకునే నవీన్ ఇటీవల యాక్సిడెంట్ కావడంతో చేయికి గాయం అయ్యింది. దీంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే నవీన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం అనగనగా ఒకరాజు. మీనాక్షి చౌదరీ ఈ సినిమాలో కథనాయికగా నటిస్తుంది.
అయితే ఈ సినిమా అనంతరం నవీన్ మణిరత్నం సినిమాలో చేయబోతున్నట్లు తెలుస్తుంది. లవ్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే అన్ని వివరాలు వెల్లడించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మణిరత్నం విషయానికి వస్తే.. ప్రస్తుతం థగ్ లైఫ్ అనే సినిమను తెరకెక్కిస్తున్నాడు. కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రం ఈ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.