Sai Pallavi – Mani Ratnam | తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం నటి సాయి పల్లవిని ప్రశంసలతో ముంచెత్తాడు. సాయి పల్లవికి నేను నేను పెద్ద అభిమానిని. తను అంటే చాలా ఇష్టమని. సమయం దొరికినప్పుడు కచ్చితంగా ఆమెతో సినిమా చేస్తానని మణిరత్నం వెల్లడించాడు. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం అమరన్. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా ఈ సినిమా రానుండగా.. ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్గా జరుపగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దర్శకుడు మణిరత్నం వచ్చి మాట్లాడాడు. ఈ క్రమంలోనే సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. సాయి పల్లవికి నేను నేను పెద్ద అభిమానిని. తను అంటే చాలా ఇష్టమని. సమయం దొరికినప్పుడు కచ్చితంగా ఆమెతో సినిమా చేస్తానని మణిరత్నం వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ManiRatnam: “I am big Fan of you SaiPallavi. Hope someday I will work with you😀”
Just look at SaiPallavi’s reaction 🥰 pic.twitter.com/h9QEviFqm0
— AmuthaBharathi (@CinemaWithAB) October 27, 2024