వినోద్‌వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకుడు. శ్రీనివాస్ రామిరెడ్డి, డాక్టర్ తిమ్మప్పనాయుడు పురిమెట్ల పీహెచ్డీ, శేషు మారంరెడ్డి నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ప్రమోషన్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని ‘ఓ.. చిన్నారి కిట్టయ్య.. సిత్రాల కిట్టయ్య.. ’ పాట ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా ఇదే పాట మంగ్లీ వెర్షన్‌ని మేకర్స్ ఆదివారం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతులమీదుగా విడుదల చేశారు. ఈ పాటతో పాటు సినిమా కూడా బాగా ఆడాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిలషించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: కృష్ణప్రసాద్, శివశంకర్ వరప్రసాద్, సంగీతం: అనూప్ రూబెన్స్.