Bayilone Ballipalike | తెలంగాణ సింగర్, ప్రముఖ జానపద గాయని మంగ్లీ (Mangli) తన కొత్త పాటతో యూట్యూబ్లో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మంగ్లీ పాడిన తాజా పాట ‘బాయిలోనే బల్లి పలికే’ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో మంగ్లీతో పాటు మరో ప్రముఖ జానపద గాయని నాగవ్వ కూడా తన గొంతును అందించారు. మంగ్లీ, నాగవ్వల కాంబినేషన్ శ్రోతలకు మరింత హుషారునిస్తోంది. ఈ పాటకు కమల్ ఎస్లావత్ సాహిత్యం అందించగా.. సురేష్ బోబ్బిలి సంగీతం సమకుర్చాడు. నాగవ్వ, మంగ్లీ కలిసి పాడారు. దాము రెడ్డి ఈ పాటకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం యూట్యూబ్లో వైరలవుతున్న ఈ పాటను మీరు చూసేయండి.