Mangalavaaram Movie | ఐదేళ్ల క్రితం కార్తికేయ హీరోగా వచ్చిన ‘ఆర్ఎక్స్100’ (RX 100) చిత్రం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పాయల్ రాజ్‌పుత్ (Payal Raj puth) తన బోల్డ్ నటనతో యూత్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. కాగా.. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి (Ajay Bhupati) ఒక్క సారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ పోషిస్తుంది.
రీసెంట్గా ఈ ‘మంగళవారం’ (Mangalavaaram) నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. దీనితో పాటు ఒక పోస్టర్‌ను కూడా వదిలారు.
Excited to show y’all a story that’ll twist your heart like never before🦋#Mangalavaaram #Mangalavaar #Chevvaikizhamai #Chovvazhcha
Releasing Worldwide in Telugu, Hindi, Tamil, Malayalam, Kannada on November 17th 🔥
An @AJANEESHB Musical 🥁@starlingpayal @Nanditasweta… pic.twitter.com/1G9OjAAn0w
— Ajay Bhupathi (@DirAjayBhupathi) September 26, 2023
#Mangalavaar pic.twitter.com/krBYNHlSZm
— Ajay Bhupathi (@DirAjayBhupathi) September 26, 2023
ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్‌పై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం ఈ సినిమాను నిర్మిస్తుండగా.. పాయల్ రాజ్‌పుత్‌తో పాటు నందిత శ్వేత, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, మ్యూజిక్ : ‘కాంతార’ ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్.