Mandira Bedi | ‘2003 ప్రపంచ కప్‌కు నేను తొలిసారి ప్రెజంటర్గా వర్క్ చేశాను. అప్పుడు క్రికెట్ లెజెండ్స్ తీరు నన్ను కన్నీళ్లు పెట్టుకునేలా చేసింది..’ అంటూ గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ నటి మందిరా బేడీ. ఓ టాక్‌షోలో ఈ విషయం గురించి ఆమె మట్లాడుతూ ‘ఇప్పుడు మహిళలు కూడా క్రీడల్లో గుర్తుంపు తెచ్చుకుంటున్నారు. కానీ ఒకప్పుటి పరిస్థితులు వేరు.
ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆ రోజుల్లో నన్ను క్రికెట్ ప్రెజంటర్గా ఎంపిక చేశారు. క్రికెట్ లెజెండ్స్‌తో మాట్లాడి.. వారినుంచి సమాధానాలు రాబట్టడం నా పని. గ్యాలరీలో, గ్రౌండ్లో నన్ను చూసి ‘ఈమె ఇక్కడేం చేస్తుంది? ఈ రంగంతో ఈమెకు సంబంధం ఏంటి? అన్నట్టు చూసేవారు.
ప్యానల్ డిస్కషన్లో ఏదైనా ప్రశ్న అడిగితే.. సంబంధం లేని సమాధానం ఇచ్చేవారు. మనసు బాధగా అనిపించేది. పక్కకెళ్లి ఏడ్చేసేదాన్ని. తొలివారం అలా చాలా ఇబ్బంది పడ్డా. తర్వాత ైస్టెల్ మార్చా. అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే.. ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టా. ఆటోమేటిగ్గా అంతా దారికొచ్చారు..’ అంటూ గుర్తు చేసుకుంది మందిరా బేడీ.